కర్నూలు: బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

73చూసినవారు
కర్నూలు: బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
కర్నూలు నగరంలో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ముందు బీసీ సమరభేరి జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జైరాజ్ మాట్లాడారు. బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని, జైంట్ కలెక్టర్‌ డాక్టర్ నవ్యకు వినతిపత్రం సమర్పించారు.

సంబంధిత పోస్ట్