కర్నూలు రెవిన్యూ డివిజన్ పరిధిలో 74 రేషన్ దుకాణాలకు డీలర్లను నియమించేందుకు నోటిఫికేషన్ జారీ చేయగా, 876 దరఖాస్తులు అందాయని డీఎస్ఓ రాజా రఘువీర్ తెలిపారు. ఆదివారం కర్నూలు ఇందిరా గాంధీ మున్సిపల్ పాఠశాలలో నిర్వహించిన రేషన్ డీలర్ల నియామక పరీక్షకు 625 మంది అభ్యర్థులు హజరయ్యారని తెలిపారు. అర్హత సాధించిన వారికి సోమవారం ఇంటర్వ్యూలు నిర్వహించి, ఉత్తీర్ణులైన వారికి చౌకధరల దుకాణాలు కేటాయిస్తామన్నారు.