కర్నూలు: రజకులకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి

72చూసినవారు
రజకులకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని ఏపీ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గురుశేఖర్ డిమాండ్ చేశారు. ఆదివారం కర్నూలులోని కార్మిక కర్షక భవనంలో వారు మాట్లాడారు. రజక కార్పొరేషన్ కు రూ. 1000 కోట్లు కేటాయించి, 90 శాతం సబ్సిడీతో రజక కుటుంబాలకు రూ. 5 లక్షలు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ధోబీ పోస్టులు భర్తీ చేయాలని, రజక సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్