కర్నూలు జిల్లా నుంచి ఎంఎల్సీగా రెండవసారి ప్రమాణ స్వీకరించిన బీటి నాయుడును ఆదివారం కర్నూలులో కూటమి పార్టీల నేతలు ఘనంగా సన్మానించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభకు ఎంపీ నాగరాజు, మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యేలు శ్యాంబాబు, పార్థసారథి హాజరై, మాట్లాడారు. తనపై విశ్వసనీయత వల్లే 2019 తొలిసారిగా శాసనమండలిలో అడుగుపెట్టి, మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారన్నారు.