కర్నూలులో సావిత్రిబాయి పూలే 194వ జయంతిని కార్మిక కర్షక భవన్ వద్ద ఘనంగా నిర్వహించారు. శుక్రవారం కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు మాట్లాడారు. సావిత్రిబాయి ఆశయాలను కొనసాగిస్తూ, కులాలకతీతంగా ప్రభుత్వమే కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే జ్యోతిబా పూలే, అంబేడ్కర్ విగ్రహాల చుట్టూ ప్రతిమలు కనపడకుండా ఫ్లెక్స్ బ్యానర్లు కట్టి అవమాన పరుస్తున్నా, అధికారులకు పట్టడం లేదన్నారు.