హత్య కేసులో నందికొట్కూరు గ్రామానికి చెందిన కురువ రవి అనే ముద్దాయికి కర్నూలు జిల్లా పిడిజె కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 5, 000 జరిమానా విధించింది. రవి తన స్నేహితుడు కురువ వెంకటరమణ వద్ద రూ. 16 లక్షలు అప్పుగా తీసుకున్న తర్వాత, డబ్బు తిరిగి ఇవ్వకుండా బి. తాండ్రపాడు గ్రామ సమీపంలోని హంద్రీనీవా సృజల స్రవంతి కెనాల్ గట్టు వద్ద కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ కేసు 2017లో నమోదు అయ్యింది.