కర్నూలు: బెల్ట్ షాపులకు అనుకూల అధికారులపై చర్యలు తీసుకోవాలి

57చూసినవారు
బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్న ఎక్సైజ్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ కర్నూలు జిల్లా కార్యదర్శి నగేష్, అధ్యక్షుడు రాఘవేంద్ర డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ కర్నూలు మండలం ఉల్చాలలో అక్రమ బెల్ట్ షాపులపై నవంబర్ 24న వినతిపత్రం ఇచ్చినా అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగించిందని తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని లేదంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్