కర్నూలు మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి దూర ప్రాంతాల నుంచి కర్నూలు పట్టణంలోని పోస్ట్ మెట్రిక్ మైనారిటీ బాలురు వసతి గృహం, 6వ తరగతి నుండి 10వ తరగతి చదువుతున్న మైనారిటీ బాలికల ప్రీ మెట్రిక్ వసతి గృహంలో ప్రవేశాలు ప్రారంభమయ్యాయని జిల్లా మైనారిటీల సంక్షేమాధికారి సైదా సబిహ పర్వీన్ గురువారం ఒక ప్రకటనలో సూచించారు. మరిన్ని వివరాలకు 9030262833, 9440822219 నంబర్లను సంప్రదించాలన్నారు.