కర్నూలు: అంబేడ్కర్ రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శం

52చూసినవారు
కర్నూలు: అంబేడ్కర్ రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శం
అంబేడ్కర్ భౌతికంగా మన మధ్య లేనప్పటికీ ఆయన రచించిన రాజ్యాంగం ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచి దిక్సూచిగా ఉంటూ అందరిని ముందుకు నడిపిస్తోందని కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ యస్. రవీంద్ర బాబు పేర్కొన్నారు. సోమవారం మున్సిపల్ ఆఫీసులో అంబేడ్కర్ జయంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని, విశ్వ వ్యాపితం చేసిన మహోన్నత కీర్తి శిఖరం అంబేడ్కర్ అన్నారు.

సంబంధిత పోస్ట్