కర్నూలు నగరంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమ వసూళ్లపై విచారణ జరిపించాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాసులు శుక్రవారం డీఆర్వోకు వినతిపత్రం సమర్పించారు. విజిలెన్స్‌తో కలెక్టర్ పరిశీలన జరిపాలని కోరారు. డీఎంహెచ్ఓ కార్యాలయం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.