కర్నూలు: ఏపీ పీజీ సెట్‌కు మంచి స్పందన

62చూసినవారు
కర్నూలు: ఏపీ పీజీ సెట్‌కు మంచి స్పందన
కర్నూలు జిల్లాలో ఏపీ పీజీ సెట్-2025 మంగళవారం నిర్వహించగా 86.28 శాతం హాజరుతో మంచి స్పందన లభించింది. కర్నూలు జిల్లాలోని జి. పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ, దూపాడు ఐయాన్ డిజిటల్ జోన్ కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. మొత్తం 831 మందిలో 717 మంది హాజరయ్యారు. హ్యుమానిటీస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్ తదితర సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహించారు. బుధవారం మరిన్ని సబ్జెక్టుల పరీక్షలు జరగనున్నాయి.

సంబంధిత పోస్ట్