రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి రోజున కూడా తరగతులు నిర్వహించిన అశోక మహిళా ఇంజనీరింగ్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని పిఎస్ఎన్ జిల్లా కన్వీనర్ అమర్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యంపై చర్యలు తీసుకోకుంటే కళాశాలను ముట్టడించేందుకు సిద్ధమన్నారు. వెంటనే కర్నూలు జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలన్నారు.