ఆస్పిరేషనల్ బ్లాకులైన హోళగుంద, మద్దికెర, చిప్పగిరి మండలాల్లో నిర్దేశించిన 40 సూచికలను వంద శాతం అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం కర్నూలులో ఆయన మాట్లాడారు. వైద్యశాఖకు సంబంధించి గర్భిణుల నమోదు, ఆసుపత్రుల్లో ప్రసవాలు, బరువు తక్కువగా పుట్టిన పిల్లల శాతం, మధుమేహ పరీక్షలు, హైపర్టెన్షన్ పరీక్షలు అంశాలను వంద శాతం చేపట్టాలని సూచించారు.