కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి శుక్రవారం న్యాయ సేవా సదన్ లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. బలవంతపు పని, మానవ అక్రమ రవాణాపై వివిధ శాఖల అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా,. ఆయన మాట్లాడారు. ఆర్టికల్ 24 ప్రకారం చిన్న పిల్లలతో ఫ్యాక్టరీల్లో పని చేయడం నేరమని చెప్పారు. అలాగే, వెట్టి నిర్మూలనపై కొత్త పోస్టర్లను ఆవిష్కరించారు.