కర్నూలు: రేపటి నుంచి పారిశ్రామికవేత్తలకు అవగాహన సదస్సు

56చూసినవారు
కర్నూలు: రేపటి నుంచి పారిశ్రామికవేత్తలకు అవగాహన సదస్సు
ఈనెల 5 నుంచి 7 వరకు కర్నూలు జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు వ్యాపార నిర్వహణ శక్తి పెంపుకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు నైపుణ్యాభివృద్ధి అధికారి ఆనంద్ రాజుకుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం పారిశ్రామికవేత్తలకు వ్యాపార నైపుణ్యాలు, విధులు, విధానాలపై అవగాహన కల్పిస్తుందని, 96761 41731 నెంబరుకు సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్