కర్నూలు: అర్హులందరికి బీసీ కార్పొరేషన్ పథకాలు అందించాలి

53చూసినవారు
కర్నూలు: అర్హులందరికి బీసీ కార్పొరేషన్ పథకాలు అందించాలి
కర్నూలు జిల్లాలో అర్హులైన ప్రతిఒక్కరికి బీసీ కార్పొరేషన్ ద్వారా పథకాలను అందించాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు సూచించారు. ఆదివారం కర్నూలులోని ఎంపీ కార్యాలయంలో ఎంపీ నాగరాజుని బీసీ కార్పొరేషన్ ఈడీ జాకీర్ హుస్సేన్ కలిసి, మాట్లాడారు. బీసీ కార్పొరేషన్ పథకాలపై ఈడీ జాకీర్ హుస్సేన్ తో ఎంపీ చర్చించారు. కార్యక్రమంలో రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ, 8వ వార్డు కార్పొరేటర్ పరమేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్