కర్నూలు: సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండండి

70చూసినవారు
కర్నూలు: సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండండి
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. ఆన్‌లైన్ గేమ్స్ పేరుతో జరుగుతున్న పెద్ద స్కామ్‌లు, రిఫరల్ లింక్‌తో జాయిన్ అవ్వాలని చెప్పి కమిషన్ ఇచ్చే వదంతులు జరుగుతున్నాయని సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే 1930 నెంబర్‌కి కాల్ చేయాలని లేదా www. cybercrime. gov. in లో ఫిర్యాదు చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్