కర్నూలు జిల్లాలో బాణాసంచా విక్రయించే షాపుల వద్ద అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. జిల్లా ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బాణాసంచా కాల్చేటప్పుడు పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలన్నారు. దీపావళి చీకట్లను పారద్రోలి ప్రజల జీవితాల్లో కాంతులు నింపాలన్నారు. ప్రజలకు, రోడ్ల వెంబడి వెళ్లే వాహనాదారులకు ఇబ్బందులు కలిగించరాదన్నారు.