కర్నూలులో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం కర్నూలు పాత బస్టాండ్‌లోని అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఎంపీ నాగరాజు, జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. స్వేచ్ఛ సమానత్వం కోసం, బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు.