జూలై 9న జరిగే దేశవ్యాప్తంగా సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం కర్నూలు బళ్లారి చౌరస్తా వరకు ప్రచార ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారు, కార్మిక హక్కులను పరిరక్షించాలని కోరారు. 9వ తేదీన భారీ కార్మిక ప్రదర్శన కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించనున్నారు.