తల్లికి వందనం నిబంధనలపై కర్నూలు జిల్లాలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా తల్లికి వందనం పథకంపై విధించిన నిబంధనలను నిరసిస్తూ శుక్రవారం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అబ్దుల్లా, రంగప్ప సుందరయ్య సర్కిల్‌లో ఆందోళన చేపట్టారు. పథకాన్ని పరిమితులకు లోబరిచేలా చేసిన జీవో 26, 27ను రద్దు చేసి ప్రతి అర్హుత కలిగిన విద్యార్థికి రూ. 15, 000 చెల్లించాలని డిమాండ్ చేశారు.