టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అబద్ధమని, వాటి అమలులో విఫలమై నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసిందని కర్నూలు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మహేంద్ర నాయుడు తెలిపారు. మంగళవారం కర్నూలు కళావెంకట్రావు భవన్‌లో మాట్లాడుతూ, డీఎస్సీ ఖాళీలను పూర్తి భర్తీ చేయక, పలు శాఖల్లో ఉద్యోగాలు నిలిపివేశారని ఆరోపించారు. ఎన్నికల హామీలు అమలుకాక ప్రజలు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు.