వైఎస్ జగన్ భద్రతపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తోందని వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుభాష్ చంద్రబోస్ శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. జగన్ పర్యటనల్లో సెక్యూరిటీ వ్యవస్థ సరిగ్గా అమలు చేయడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై సమీక్ష చేయాలని కోరారు. జాతీయ పార్టీ నాయకుల కుటుంబ సభ్యులు, మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చెబ్రోలు కిరణ్ వంటి వ్యక్తులను వెంటనే జైలుకు పంపాలన్నారు.