మనం చదువుకున్న పాఠశాలకు మన వంతు సహాయంగా అభివృద్ధి చేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా తెలిపారు. ఆదివారం నందికొట్కూరులో పరిషత్ ప్రాథమిక పాఠశాల జిల్లా కలెక్టర్ ప్రాథమిక విద్య అభ్యసించిన తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధి చేయాలన్న ఉద్దేశ్యంతో ఆ పాఠశాలలో రూ. 13 లక్షలతో చేపట్టనున్న మరమ్మతు పనులకు నందికొట్కూరు ఎమ్మెల్యే తో కలిసి జిల్లా కలెక్టర్ శంకుస్థాపన చేశారు.