కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజు సమీపంలోని అన్న క్యాంటీన్‌లో ఆహార నాణ్యతను నగరపాలక కమిషనర్ ఎస్. రవీంద్ర బాబు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. శనివారం ఆయన మాట్లాడారు. ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, క్యాంటీన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కమిషనర్ నిర్వాహకులకు సూచించారు. పేద ప్రజలకు ప్రభుత్వం రూ. 5 కే నాణ్యమైన భోజనం అందిస్తుందని, దీనిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.