కర్నూలు నగరంలో బి. క్యాంపు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం 'డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం' ప్రారంభోత్సవం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ విద్యార్థులతో సహపంక్తి భోజనం చేశారు. పథకం ప్రారంభంలో కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డా. బి. నవ్య, సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.