కర్నూలు శివార్లలోని ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కార్యాలయంలో శనివారం జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా, జేసీ నవ్యతో రాష్ట్ర విద్యుత్ ప్రణాళికపై స్టేట్ కోఆర్డినేషన్ ఫోరం సమావేశం నిర్వహించారు. ముఖ్య కార్యదర్శి విజయానంద్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో కమిషన్ ఛైర్మన్, సభ్యులు, ఎపిసిపిడిసిఎల్ ఎండీ, ట్రాన్స్ కో సిఎండీ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ప్రణాళిక, సరఫరా, తగిన ఆధునీకరణ అంశాలను సమీక్షించారు.