కర్నూలు: ఎస్‌.ఎస్‌.సి పరీక్షలు, స్వర్ణ ఆంధ్రపై సీఎస్ సమీక్ష

85చూసినవారు
కర్నూలు: ఎస్‌.ఎస్‌.సి పరీక్షలు, స్వర్ణ ఆంధ్రపై సీఎస్ సమీక్ష
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ బుధవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఎస్‌.ఎస్‌.సి పరీక్షల సంసిద్ధత, రాబోయే కలెక్టర్ల కాన్ఫరెన్స్ సూచనలు, స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, P4 సర్వే తదితర అంశాలపై సమీక్ష జరిగింది. కర్నూలు కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డా. బి. నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you