కర్నూలు జిల్లాలో బీసీ, ఈబీసీ రుణాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు 12వ తేదీ వరకు గడువు పెంచినట్లు బీసీ కార్పొరేషన్ ఈడీ జాకీర్ హుస్సేన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వివిధ రకాల కార్పొరేషన్లకు సంబంధించిన అర్హులైన లబ్ధిదారులు నిర్ణీత గడువులోగా ఏపీ ఓబీఎంఎంఎస్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.