కర్నూలు నగరంలోని సర్వజన వైద్యశాలలో శుక్రవారం పర్చేజ్ కమిటీ సమావేశమై పలు కీలక వైద్య పరికరాల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. ఆటోక్లేవ్‌లు, హీమోడయాలసిస్ యంత్రాలు, డీఆర్ ప్యానెల్లు, ఎయిర్ కంప్రెసర్, ఫ్లోర్స్ బెడ్స్, కంప్యూటర్ సిస్టంలు కొనుగోలు చేయనున్నారు. సూపరింటెండెంట్ కె. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ పరికరాలు రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు తోడ్పడతాయని తెలిపారు.