కర్నూలు: ముందస్తు అడ్మిషన్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

56చూసినవారు
కర్నూలు: ముందస్తు అడ్మిషన్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
కర్నూలు జిల్లాలో ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా, అధ్యక్ష కార్యదర్శులు అబ్దుల్లా, రంగప్ప డిమాండ్ చేశారు. శనివారం డీఈవో శామ్యూల్ పాల్ కు ఫిర్యాదు చేస్తూ, వినతిపత్రం అందజేశారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తుండగా, ఫీజుల నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. జీవో 1ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్