కర్నూలు పట్టణంలోని సి. క్యాంపులో ప్రభుత్వం శారీరక వికలాంగుల (దివ్యాంగుల)బాలుర వసతి గృహం ఏర్పాటు చేశారని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ అధికారిని రయిస్ ఫాతిమా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి 100 మందికి వసతి ఉంటుందని, దరఖాస్తులు మే 10 వరకు అందించాలన్నారు. ఈ వసతి గృహంలో ఉచిత భోజనం, పుస్తకాలు, ఇతర సదుపాయాలు అందిస్తున్నట్లు, మరిన్ని వివరాలకు 08518-277864 లో సంప్రదించాలన్నారు.