కర్నూలు జిల్లాలో డీలర్ల పోస్టులకు దళారులను నమ్మి మోసపోవద్దని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. బి. నవ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చౌక దుకాణం డీలర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రస్తుతం నిలిచిపోయినప్పటికి, రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటన చేయనుంది. ఈ భర్తీ పూర్తిగా రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుందని తెలిపారు. డబ్బులు అడిగితే సమాచారం ఇవ్వాలని కోరారు. పుకార్లను నమ్మవద్దని సూచించారు.