కర్నూలు నగరంలోని గిప్సన్ కాలనీ తేజా డీలక్స్ అపార్టుమెంటులో గతంలో జరిగిన పి. మధుసూదన్ రెడ్డి, పి. రమాదేవి జంట హత్యల కేసులో నేరం రుజువు కానందున కేసును కొట్టివేస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్ధి గురువారం తీర్పు చెప్పారు. 2013 డిసెంబర్ 29న ఇంటిపై దాడి చేసారు. డబ్బు దొరకకపోవడంతో ఒంటిపై ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లారు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్షాధారాలు రుజువు కానందున కేసు కొట్టివేశారు.