ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని కర్నూలు డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ఎస్. శాంత కుమారి అన్నారు. బుధవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల 36వ జాతీయ రోడ్డు మాసోత్సవాల్లో భాగంగా ఆమె మాట్లాడారు. వాహనదారులు తమ వాహనాన్ని నడిపేటప్పుడు రహదారి భద్రతా నియమ నిబంధనలు పాటించి ప్రమాదాలను నియంత్రించాలన్నారు. వాహనం నడిపే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు