రైతు సమస్యలను పరిష్కరించకుండానే ఏరువాక పున్నమి సంబరాలు చేయడం ఏంటాని ప్రభుత్వాన్ని రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ ప్రశ్నల వర్షం కురిపించారు. కర్నూలు మండలం ఉల్చాలలో డీవైఎఫ్ఎ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర అధ్యక్షతన బుధవారం ఏరువాక పున్నమి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. సాగు, తాగునీటి ప్రాజెక్టులను నిర్మించాలన్నారు. పంటల దిగుబడికి తగిన ధరలను కేటాయించాలని, రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.