కర్నూలు వడ్డెగేరిలోని కేవీఆర్ గార్డెన్స్‌లో ఉన్న నగరపాలక ఉర్దూ ప్రాథమిక పాఠశాల భవనం, నాడు-నేడు రెండో విడతలో కొత్తగా కడతామన్నప్పుడు కూల్చేశారు. కానీ నిధుల లేక పనులు పునాదిదశలోనే ఆగిపోయాయి. దీంతో పక్కనున్న పాఠశాల గదిలోనే చదువు సాగిస్తున్నారు. సామగ్రి నిండిపోయిన ఇరుకైన గదిలో పిల్లలు కూర్చోవడానికే స్థలంలేక, ప్రమాదాలు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది.