కర్నూలు పట్టణం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీమార్ట్ వెనక టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించిన కేసులో మంగళవారం ప్రభాకర్ నాయుడు, కాశీ, రహంతుల్లా, సలాంఖాన్ అనే నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐ మధుసూదన్ గౌడు మాట్లాడుతూ దాడిలో వేటకొడవళ్లు, కత్తులతో ప్రాణాలపై ప్రమాదం కలిగించే ప్రయత్నం చేసినట్టు తెలిపారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్‌కు తరలించారు.