ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ఏపీ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం కర్నూలులో అధ్యక్షుడు సి. ముక్కన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి సి. గురుశేఖర్ మాట్లాడుతూ ఉచిత విద్యుత్, కార్పొరేషన్ నిధులు, చెరువుల కేటాయింపు, నామినేటెడ్ పోస్టులు, సామాజిక రక్షణ చట్టం వంటి అంశాలన్నీ మేనిఫెస్టోలో ఉన్నప్పటికీ, ఒక్కదానికి కూడా కార్యరూపం దాల్చలేదన్నారు.