ముస్లిం సమాజాన్ని కక్షపడి ఇబ్బంది పెట్టాలని చూస్తున్న బీజేపీ పార్టీలో ఎమ్మెల్సీ జాకీయా ఖాతున్ చేరడం వల్ల వైసీపీ నష్టం లేదని కర్నూలు మాజీ ఎమ్మెల్యే, పీఏసీ సభ్యుడు హఫీజ్ ఖాన్ వ్యాఖ్యానించారు. గురువారం కర్నూలులో మాట్లాడిన ఆయన.. జగన్ మోహన్ రెడ్డి ముస్లిం మహిళను ఎమ్మెల్సీ చేసి, చరిత్రలో తొలిసారి డిప్యూటీ చైర్పర్సన్ పదవి ఇచ్చారని ప్రశంసించారు. ఆమె పార్టీ మారడంతో వారి కుటుంబం మానసికంగా బాధపడుతుందన్నారు.