కర్నూలు జిల్లాలో దంచి కొట్టిన వానలు

59చూసినవారు
కర్నూలు జిల్లాలో వరుణుడు విరుచుకుపడ్డాడు. బుధవారం నుంచి గురువారం వరకు సగటున 31.1 మి. మీ వర్షపాతం నమోదైంది. కోడుమూరులో 79. 4 మి. మీతో అత్యధిక వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగిపొర్లగా హంద్రీనదికి వరదనీరు చేరింది. వర్షాలుండగా వ్యవసాయ అధికారుల బదిలీలతో విత్తనాల పంపిణీ నిలిచిపోయింది. ఇప్పటివరకు కేవలం 7400 హెక్టార్లలోనే పంటల సాగు జరిగింది.

సంబంధిత పోస్ట్