మే 17న సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో 1700 మందితో భారీ భద్రత ఏర్పాట చేయనున్నట్లు తెలిపారు. రూట్, సభా స్థలాల వద్ద మఫ్టీ, స్పెషల్ పార్టీ, బాంబ్ స్క్వాడ్ సహా అన్ని విభాగాల సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలుండకూడదని ఆదేశించారు. 4 అడిషనల్ ఎస్పీలు, 11 డీఎస్పీలు, 53 సీఐలు, 101 ఎస్సైలు తదితరులు బందోబస్తులో పాల్గొనున్నారు.