కర్నూలు నగరంలో స్థానిక ఆటోనగర్ లో శుక్రవారం ముస్లింలు వక్ఫ్ చట్ట సవరణను రద్దు చేయాలంటూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. మస్జిద్ ఏ ఆయేషా దేశాయ్ నుంచి సంతోష్ నగర్ వరకు మానవహారం ఏర్పాటు చేశారు. వక్ఫ్ బోర్డు ఆస్తులపై ప్రభుత్వ జోక్యాన్ని ఖండిస్తూ కేంద్రాన్ని తప్పుబట్టారు. వక్ఫ్ పాలకమండలిలో ముస్లిమేతరులు సభ్యులుగా ఉండాలన్న నిబంధన ముస్లిం మతాచారాల్లో జోక్యం చేసుకోవడమేనని అభ్యంతరం వ్యక్తం చేశారు.