కర్నూలు: తల్లికి వందనంలో కోత విధించటం సిగ్గుచేటు: ఎస్ఎఫ్ఐ

54చూసినవారు
తల్లికి వందనంలో కోత విధించటం సిగ్గుచేటని కర్నూలు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అబ్దుల్లా, రంగప్ప విమర్శించారు. గురువారం కర్నూలులో వారు మాట్లాడుతూ విద్యార్థుల తల్లికి ఇచ్చే వందనం పథకంలో కోత విధించడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ప్రతి విద్యార్థికి రూ. 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు పాఠశాల అభివృద్ధి పేరుతో రూ. 2 వేల కోత పెట్టడం చిగ్గుచేటు అన్నారు.

సంబంధిత పోస్ట్