కర్నూలు: జిల్లా టాపర్ నిర్మలను ఘనంగా సన్మానించిన జేసీ నవ్య

71చూసినవారు
కర్నూలు: జిల్లా టాపర్ నిర్మలను ఘనంగా సన్మానించిన జేసీ నవ్య
ఇంటర్మీడియట్ పరీక్షల్లో కర్నూలు జిల్లా టాపర్‌గా నిలిచిన పెద్దహరివనంకు చెందిన నిర్మలను మంగళవారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. కర్నూలు జిల్లా జేసీ బి. నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప పాల్గొని, నిర్మలకు శాలువ కప్పి సత్కరించారు. కేజీబీవీ కళాశాల, ఆస్పరిలో బైపీసీ విభాగం చదువుతున్న నిర్మల 966 మార్కులతో ప్రథమస్థానంలో నిలిచింది.

సంబంధిత పోస్ట్