కర్నూలు నగరంలోని బిర్లాగేటు పోస్టాఫీసు ఎదురుగా ఉన్న ఎన్ఏసీ శిక్షణ కేంద్రంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి పి. దీప్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఐసీ, అమరాజా కంపెనీల ప్రతినిధులు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యాగాలకు ఎంపిక చేసుకుంటారని చెప్పారు. డిగ్రీ, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు.