డబ్బులిస్తే ఉద్యోగాలు రావని, పోటీ పరీక్షలు, ప్రతిభ ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు మాత్రమే వస్తాయని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాఫ్ట్ వేర్ జాబ్స్, బ్యాంకుల్లో ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు, హోంగార్డు ఉద్యోగాలు, ఫుడ్ కార్పొరేషన్ ఉద్యోగాలు అంటూ మధ్య దళారులకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దని, అమాయకులనే లక్ష్యంగా చేసి దళారులు మోసాలకు పాల్పడుతున్నారన్నారు.