కర్నూలు నగరం బుధవారపేటలోని సాయి అనాధ ఆశ్రమాన్ని మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి, లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్ తదితరులు తనిఖీ చేశారు. ఆశ్రమంలో రికార్డుల లోపం, పరిశుభ్రత లోపంపై సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తమైంది. పిల్లల సమస్యలు తెలుసుకున్నారు.