కర్నూలు నగర పాలక సంస్థలో ఇంజనీరింగ్ సిబ్బంది నిరసన కార్యక్రమంలో శనివారం మాజీ కేడీసీసీ బ్యాంక్ చైర్‌పర్సన్ ఎస్వీ విజయ మనోహరి పాల్గొని సంఘీభావం తెలిపారు. తగిన జీతాలు, సంక్షేమ పథకాలు, 69 రోజుల సెలవు, ఉద్యోగ మరణం పట్ల పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులకు వైఎస్ఆర్సీపీ పూర్తి మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మునెమ్మ, పార్టీ నేతలు పాల్గొన్నారు.