కర్నూలులో తొలిసారిగా 30కేడబ్ల్యూ లేజర్ బేస్డ్ వెపన్ సిస్టమ్‌ని డీఆర్డీవో ఆదివారం విజయవంతంగా పరీక్షించింది. ఈ టెక్నాలజీ ఇప్పటివరకూ చైనా, అమెరికా, రష్యా వద్ద మాత్రమే ఉండేది. ఇప్పుడు ఈ ఘనత సాధించిన 4వ దేశంగా భారత్ నిలిచింది. ఈ సందర్భంగా డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సమీర్ వీ కామత్ మాట్లాడుతూ, త్వరలోనే తాము గమ్యస్థానాన్ని చేరుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సాంకేతికత మనకు స్టార్ వార్స్‌లాంటి సామర్థ్యాన్ని ఇస్తాయన్నారు.